Tuesday, March 25, 2014

బాలయ్యకు విలన్.. రామ్ చరణ్‌కు తండ్రి... జగపతి బాబు న్యూ రోల్!

 
పలు సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతి బాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తాజాగా బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ చిత్రంలో తండ్రి పాత్రనూ పోషించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. చరణ్‌కు యంగ్ బాబాయ్‌గా శ్రీకాంత్ నటించనున్నాడు.

మొదట్లో చెర్రీకి తండ్రిగా కృష్ణ, కృష్ణంరాజు, మరికొందరి పేర్లను పరిశీలించారు. అయితే ఇపుడు ఈ పాత్రకు జగపతి బాబు అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో ఈయన జాయిన్ అవుతాడట.

No comments:

Post a Comment