కన్నడ బ్యూటీ ప్రణీతకు మరో గోల్డెన్ ఆఫర్ దక్కే ఛాన్స్ ఉందని లేటెస్ట్ న్యూస్. అత్తారింటికి దారేది మూవీలో సెకండ్ హీరోయిన్‌గా సమంతకన్నా గ్లామర్‌గా కనిపించిందని రెస్పాన్స్ కొట్టేసిన ప్రణీతకు వెంటనే ఎన్.టి.ఆర్ “జోరు”లో ఆఫర్ వచ్చింది. అయితే ఈసారీ మళ్ళీ సెకండ్ హీరోయిన్ రోల్‌లోనే. సడెన్‌గా ప్రణీతకు మహేష్ బాబు “ఆగడు”లో మెయిన్ హీరోయిన్ రోల్ దక్కే అవకాశం ఉందని టాక్.
ఇప్పటికే ఆ మూవీలో హీరోయిన్‌గా తమన్నా కన్ఫర్మ్ అయినా మూవీలో క్యారెక్టర్ తమన్నాకు సెట్ కాదని, ఎవరైనా అప్‌కమింగ్ బ్యూటీ బెటర్ అనే నిర్ణయానికి యూనిట్ వచ్చిందట. బాహుబలిలో ప్రణీత నటిస్తుందనే వార్తలను రాజమౌళి కొట్టేశాక ఆగడు టీం కన్ను ప్రణీతపై పడిందని అంటున్నారు . ఈ న్యూస్ కన్ఫర్మ్ అయితే ప్రణీత ఫేట్ మారినట్టే అని ఇండస్ట్రీ టాక్!
No comments:
Post a Comment