'జులాయి'
సినిమా తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో
సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు
భామలతో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకరిగా సమంతను ఎంపిక
చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ హీరోయిన్లలనూ ఎంపిక చేసే పనిలో
డైరెక్టర్ త్రివిక్రమ్ బిజీగా వున్నారట. అయితే ఈ సినిమా జనవరిలోనే మొదలు
కావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని
'జులాయి' చిత్ర నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం, అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గీతా ఆర్ట్స్
సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో ప్రక్క
అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' విడుదలకు సిద్దమవుతుంది. సురేందర్‌రెడ్డి,
అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ
అంచనాలు వున్నాయి.
No comments:
Post a Comment