శ్రీకాంత్ హీరోగా
స్వీయ దర్శకత్వంలో జొన్నలగడ్డ శ్రీనావాసరావు మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
పతాకంపై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంతో జరుగుతోంది.
మెరిడియన్ స్కూల్‌లో హీరో, హీరోయిన్ జట్ల మధ్య బాస్కెట్ బాల్ కాంపిటీషన్‌ను
దర్శకుడు చిత్రీకరించారు. ఇందులో హీరో తరపున పిల్లలు, హీరోయిన్ తరపున
"గబ్బర్‌సింగ్" గ్యాంగ్ పోటీలో పాల్గొనే సన్నివేశాలను వినోదభరితంగా తీశారు
దర్శకుడు శ్రీనివాసరావు.ఈ సందర్భంగా దర్శకనిర్మాత జొన్నలగడ్డ
శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "ప్లాన్ చేసిన ప్రకారం వర్క్ చాలా ఫాస్ట్‌గా
జరుగుతో్ంది. ఈ నెలాఖరు వరకూ జరిగే షూటింగ్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.
సినిమాలో మిగిలిన రెండు పాటలను వచ్చే నెల్లో శ్రీకాంత్, సోనియా మాన్‌పై
స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తాం. జూన్‌లోనే సినిమాను విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు."కథ మీద నమ్మకంతో నేను
నిర్మాతగా మారి తీస్తున్న సినిమా ఇది. పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది. ఓ
యాంగ్రిమేన్ తన సెలవు రోజుల్ని చిన్న పిల్లలతో వస్తే ఎలా ఉంటుందనే
కథాంశాన్ని నాన్‌స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. చిత్రం
టైటిల్‌ని త్వరలో వెల్లడిస్తాం" అన్నారు శ్రీనివాసరావు.ఆలీ, పోసాని
కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు,
శివాజీరాజా, బ్రహ్మాజీ, జీవా, దువ్వాసి మోహన్, కాదంబరి కిరణ్, బెనర్జీ,
హేమ, అన్నపూర్ణ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:
భూపతిరాజా, మాటలు: రాజేంద్రకుమార్, సంగీతం: చక్రి, పాటలు: చంద్రబోస్,
ఫోటోగ్రఫీ: సిహెచ్. గోపీనాథ్, ఎడిటింగ్: గౌతంరాజు, సహ నిర్మాతలు:
సి.ఎన్.రెడ్డి, జి.జ్యోతిక, నిర్మాణం, దర్శకత్వం: జొన్నలగడ్డ
శ్రీనివాసరావు.
No comments:
Post a Comment