Saturday, June 14, 2014

వామ్మో ఇక ఐటమ్ సాంగ్స్ చేయనంటే చేయను: విద్యాబాలన్

డర్టీ పిక్చర్‌తో ప్రపంచ వ్యాప్తంగా టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన విద్యాబాలన్ ఇకపై ఐటమ్ సాంగ్స్ చేసేది లేదంటోంది. 'ఫెరారీ కీ సవారీ' చిత్రంలో ఐటెం సాంగ్ లో డాన్సు చేసిన విద్యాబాలన్.. ఇక మీదట అలాంటి పాటలు చేసేది లేదని స్పష్టం చేసింది. అవి చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నిక్కచ్చిగా చెప్పేసింది. 'బాబీ కో సబ్ మాలూమ్ హై' అనే బ్లాగ్ ప్రారంభ కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొంది.
 
ఈ కార్యక్రమంలో ఆమెను భవిష్యత్తులో కూడా ఐటెం సాంగ్స్ చేస్తారా అని ప్రశ్నించగా, ఇక మీదట తనను ఎవరూ ఐటెం సాంగ్స్ లో చూడలేరని స్పష్టం చేసింది. కాగా విద్యాబాలన్ తాజా చిత్రం  బాబీ జాసూస్ చిత్రం జూలై 4న విడుదల కానుంది. సమర్ షేక్ దర్శకత్వంలో దియా మీర్జా, ఆమె కాబోయే భర్త సాహిల్ సంగా కలిసి నిర్మించిన ఈ సినిమాలో అలీ ఫజల్ కూడా నటించాడు.

No comments:

Post a Comment