త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న
చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఓ హీరోయిన్ సమంత కాగా మరో హీరోయిన్ గురించి
త్రివిక్రమ్ తెగ ఆలోచించాడట. చిట్టచివరికి నయనతార అయితే అదిరిపోద్ది
అనుకుని ఆమెను సంప్రదించాడట. నయనతార దానికి తల ఊపాల్సి ఉన్నట్లు టాలీవుడ్
న్యూస్.
అల్లు అర్జున్ సరసన నయనతారను ఊహించు కోవడం
కష్టమే. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఉందని కొందరు అంటున్నారు. అదేమిటయా.. అంటే
అల్లు అర్జున్ కంటే వయసులో పెద్దదిగా ఉన్నట్లు కనిపించే నయనతారకు తగ్గ
పాత్ర అందులో ఉందట. దాని ప్రకారం నయనతార అయితేనే దానికి సరిపోతుందని
చెపుతున్నారు. చూద్దాం... ఒకవేళ నయనతారను తీసుకుంటే త్రివిక్రమ్ ఎలా
చూపిస్తాడో...?!!
No comments:
Post a Comment