Saturday, September 20, 2014

కృష్ణవంశీని పట్టుకుని ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి...

Chiranjeevi
చిరంజీవి కళ్ల వెంట నీళ్లు పెట్టుకుని ఏడ్చేసిన ఘటన జరిగిందంటూ టాలీవుడ్ న్యూస్. ‘గోవిందుడు అందరి వాడేలే’ టీజర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు కృష్ణవంశీ తన అహంకారం వల్ల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ మిస్ అయ్యానని బహిరంగంగా చెప్పడమే కాకుండా కన్నీరు పెట్టుకున్నారు. దాంతో రామ్ చరణ్ కృష్ణవంశీని ఓదార్చాడు. అది జరిగి కొన్ని రోజులు అయింది. 
 
తాజాగా ఇపుడు చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారంటూ టాలీవుడ్ లో న్యూస్ వినబడుతోంది. విడుదలకు దగ్గరవుతున్న గోవిందుడు అందరి వాడెలె చిత్రం సినిమా రషెస్‌ను చిరంజీవి ఇటీవల కృష్ణవంశీతో కలిసి వీక్షించారట. ఆ చిత్రంలో సెంటిమెంట్స్ చూసి చిరంజీవికి ఏడుపు ఆగలేదట. దాంతో అనుకోకుండానే కళ్లవెంట కన్నీరు వచ్చేసిందట. 
 
రామ్ చరణ్ నుంచి అద్భుతమైన నటనను రాబట్టినందుకూ, సెంటిమెంటుతో హృదయాన్ని పిండేసిన వైనాన్ని మెచ్చుకుంటూ కృష్ణవంశీని పట్టుకుని ఏడ్చేశారట చిరంజీవి. ఇపుడీ వార్త ఫిలిమ్ సర్కిల్ లో తిరుగుతోంది.
http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ram-charan-made-chiru-cry-in-govindudu-114091100052_1.html

No comments:

Post a Comment