Wednesday, March 12, 2014

'జనసేన'కు షాక్... ఐనా ఇండిపెండెంట్లుగా పవన్ మార్కుతో...

pawan kalyan

మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించబోయే 'జన సేన' పార్టీ రిజిస్టర్ విషయంలో ఏవో కొన్ని అడ్డంకులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 10న ఈ పార్టీ పేరు కోసం దరఖాస్తు చేసుకోగా ఎన్నికల నాటికి 'జన సేన' పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకవేళ పార్టీ రిజిస్టర్ కుదరకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దూకేందుకు పవన్ యువసేన నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా 14వ తేదీన పార్టీ వ్యవహారం కొలిక్కి రాకపోయినా తాను అనుకున్నది అనుకున్నట్లు పవన్ కళ్యాణ్ బద్ధలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment