చిత్రంలోని నటీనటుల పరిచయవేదిక రాత్రి జరిగింది. 2 వేల రూపాయలతో వైజాగ్ నుంచి కర్నాటక వెళ్లిన సతీష్.. అంచెలంచెలుగా కోట్లకు అధిపతి అయ్యాడు. చిరకాల వాంఛ హీరోగా తెరపై చూసుకోవడం. అందుకే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికి కృష్ణారెడ్డికి భారీగానే చెల్లించారు. యముడి పాత్రకు మోహన్‌బాబును ఎంపిక చేశారు. చిత్రగుప్తునిగా బ్రహ్మానందం... వీరిద్దరూ సతీశ్‌ను ఆకాశంలోకి తీసుకెళ్లారు. పొగడ్తలు మామూలుగా లేవు.
సతీశ్ నుంచి చూసిప్పుడు స్వర్గం నరకంలో నేను నటించారు. అప్పటితో పోలిస్తే నాకంటే సతీశ్ బాగున్నాడు... అంటూ బెంగుళూరు వెళ్లినా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినా.. నన్నెంతో బాగా చూసుకున్నాడంటూ తెగ పొగిడేశాడు. సామాన్యంగా మోహన్‌బాబు ఎవరినీ పొగడడు. కానీ చిత్ర నిర్మాత భారీగా వీరికి మూల్యం చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే యమలీలకు సీక్వెల్ కాదు. పేరు అలా పెట్టామని దర్శకుడు చెప్పారు.
No comments:
Post a Comment