ఊరిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఐస్
క్రీమ్‌ను చూసేందుకు మరో రోజు వరకు వేచి చూడక తప్పదు. ఎందుకంటే ఈ
'ఐస్‌క్రీమ్' విడుదల ఒకరోజు వాయిదా పడటే. 'ఐస్‌క్రీమ్' చిత్రం ఈ నెల 11న
విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సినిమా విడుదల తేదీ
మారినట్లు సమాచారం. ప్రకటించిన తేదీకి ఒక రోజు లేటుగా, అంటే 12 వ తేదీన ఈ
చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట.
నవదీప్, తేజస్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా
సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ పొందింది. చిత్రం విడుదల
ఆలస్యానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ట్రెయిలర్ విడుదలయినప్పటి నుంచి
వారవారం ఒక మీడియా సమావేశం నిర్వహిస్తూ, చిత్రానికి మంచి హైప్ క్రియేట్
చేసింది. ముఖ్యంగా ఫ్లో కాం టెక్నాలజీ, తేజస్వి గ్లామర్, ఆర్‌జీవి
దర్శకత్వం ఈ విషయాలు ఆల్‌రెడీ ప్రేక్షకులలో అంచనాలను పెంచేశాయని
చెప్పవచ్చు.
No comments:
Post a Comment