Tuesday, November 11, 2014

సంక్రాంతి కానుకగా రానున్న రుద్రమదేవి!

rudramadevi 
సంక్రాంతి కానుకగా రుద్రమదేవి రిలీజ్ కానుంది. అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడంలో ఎక్కువ సమయం అవసరం అవుతున్నందున ఆ తేదీకి సినిమా రెడీ కావడం లేదట. 
 
దీంతో ఇక సంక్రాంతికి రిలీజ్ చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. ఇందులో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర చిత్రానికి హైలైట్ అవుతుందని సినీ యూనిట్ భావిస్తోంది.

No comments:

Post a Comment