Tuesday, December 30, 2014

వేశ్యగా నయన్...?! పంతం నెగ్గించుకుంది.. ఎందుకో..?!

నయనతార తమిళంలో నటిస్తున్న చిత్రం 'నైట్ షో'. ఇందులో ఈ అమ్మడు వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నయనతో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. మొదట్లోనే ఈ చిత్రానికి 'నైట్ షో' అనే పేరు పెట్టారు. ఆ టైటిల్ తో ప్రచారం కూడా విపరీతంగా వచ్చింది. అయితే, ఇటీవల ఉన్నట్టుండి నయనతార ఆ టైటిల్ మార్చమంటూ కూర్చుందట.
 
ఏది ఏమైనా, 'ఆ టైటిల్ మార్చాల్సిందే' అంటూ పట్టుబట్టడంతో దర్శక నిర్మాతలకు మార్చడం తప్పలేదు. ఆ టైటిల్ చాలా చీప్ గా ఉందనీ, 'సీ' గ్రేడ్ హీరోయిన్లు నటించే సినిమాలకు అలాంటి టైటిళ్లు ఉంటాయనీ ఆమె సన్నిహితులు ఆమెకు బాగా ఎక్కించడంతో, 'టైటిల్ మార్చాల్సిందే' అంటూ నయన్ పట్టుబట్టింది. 
 
ఆ సినిమాకి ఆమే ప్రధానం కాబట్టి దర్శక నిర్మాతలకు మనసు అంగీకరించకపోయినా ఇప్పుడా టైటిల్ని 'మాయ' అంటూ మార్చారట. గతంలో నయనతార నటించిన 'ఆరంభం' సినిమాలో ఆమె పాత్ర పేరు మాయ. అందుకే, ఆ పేరును ఖరారు చేసిందట. ఎట్టకేలకు నయనతార తన పంతం నెగ్గించుకుంది. 
http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/nayanathara-makes-changes-to-the-title-114123000014_1.html
 

No comments:

Post a Comment