Monday, March 16, 2015

వినాయకచవితికి ‘బెంగాల్‌ టైగర్‌’



రవితేజ హీరోగా నటిస్తున్న ‘బెంగాల్‌ టైగర్‌’ సెప్టెంబర్‌ 18న విడుదల కానుంది. తమన్నా, రాశిఖన్నా నాయికలు. సంపత్‌ నంది దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సంపత్‌ నంది తొలి సినిమా మా సంస్థలోనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమాను ఫుల్‌ మాస్‌ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. బొమన్‌ ఇరానీ కీలక పాత్రలో కనిపిస్తారు. మార్చి 14తో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. ఏప్రిల్‌ 9 నుంచి రెగ్యులర్‌గా షూటింగ్‌ జరుపుతాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌ 18న వినాయకచవితి సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు’’ అని అన్నారు. రావు రమేష్‌, సాయాజీ షిండే, నాజర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: సుందర్‌ రాజన్‌, ఎడిటర్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=92241&SupID=24

No comments:

Post a Comment