Monday, March 16, 2015

కాంచన-2 ఫస్ట్ లుక్: దెయ్యంగా తాప్సీ.. ఆ రోలే హైలైట్!

కాంచన మూవీతో ప్రేక్షకులను భయపెట్టిన కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స కాంచనకు సీక్వెల్‌గా కాంచన-2 తెరకెక్కించనున్నారు. తాజాగా కాంచన-2 ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో లారెన్స్ పసుపురంగు పులుముకుని ఎర్రటి బొట్టు పెట్టుకుని కూర్చుని ఉంటాడు. అలాగే ఈ సినిమాలో తాప్సీ దెయ్యంగా మారుతుందట. కాంచనలో లారెన్స్‌కు దెయ్యం ఆవహిస్తే ఇక్కడ తాప్సీ దెయ్యమై ఓ ఆటాడుకుంటుందని సమాచారం. తాప్సీ నటన సినిమాకే హైలెట్ అని సమాచారం. 
 
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా డిలే అవుతూ వస్తోంది. టెక్నికల్ ఎఫర్ట్స్ వల్లే జాప్యం జరిగింది. ఈ నెలలోనే ఆడియోను రిలీజ్ చేసి సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నిత్యామీనన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

No comments:

Post a Comment