Wednesday, July 22, 2015

వినాయక చవితికి రామ్‌ 'శివమ్‌'

Ram



పండగ చేస్తో వంటి ఘనవిజయం తర్వాత రామ్‌ తెరపై కన్పించబోతున్న సినిమా 'శివమ్‌' శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాఉ. సురేందర్‌రెడ్డి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌ సరపన రాశీఖన్నా కథానాయికగా నటిసోతంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఆర్‌ఎఫ్‌సిలో ఈనెల 31 వరకు ఈ షెడ్యూల్‌ జరగుతుంది. స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ, ఇది హై ఓల్టేజ్‌ లవ్‌ స్టోరీ లవ్‌ కామెడీ, సెంటిమెంట్‌ యాక్షన్‌ అన్ని అంశాలâ ఉన్న కథ . రామ్‌ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ పాత్ర చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారన్నారు. వచ్చేనెల పాటల చిత్రీరణ మొదలు పెడతామన్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామనానరు. బ్రహ్మానందం, అభిమన్య సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: రసూల్‌, యాక్షన్‌: పీటర్‌ హెయిన్స్‌ పనిచేస్తున్నారు.
- See more at: http://www.vaartha.com/node/2384#sthash.maiafXb3.dpuf

No comments:

Post a Comment