కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ‘24’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు హక్కులను యంగ్ హీరో నితిన్ దక్కించుకున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత కథానాయికగా నటింస్తుండగా... మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
No comments:
Post a Comment